
ఎవరిదీ నిర్లక్ష్యం?
–8లో
కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుఫాన్ల కారణంగా కురుస్తున్న వర్షాలతో కూరగాయ రైతు కుదేలయ్యాడు.
క్షలు నిర్వహించగా, పచ్చకామెర్లగా తేలింది. ఇటీవల దసరా రోజున జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికే దాదాపు 135 మంది విద్యార్థులు వైద్యకోసం వచ్చారు. వీరిలో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు 85 మంది వరకు ఉన్నారు. గురుకుల, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 24 మందికి పచ్చకామెర్లగా గుర్తించారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు కురుపాం పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు విద్యార్థినులకు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది పిల్లలు అనారోగ్యం పాలవ్వడం.. ఇద్దరు మృతి చెందడంపై గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలోపమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా నిర్లక్ష్యం...
ఆశ్రమ, సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన తాగునీరు, విద్యార్థులకు సరైన ఆహారం అందకపోవడం వల్ల ఎక్కువగా
విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికితోడు ఏజెన్సీ ప్రాంతంలో దోమల కారణంగా మలేరియా, డెంగీ వంటివి అధికంగా సంభవిస్తున్నాయి. వ్యాధి మొదటి దశలోనే గుర్తించి, చికిత్స అందించేలా ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన వైద్యసిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. కురుపాంలో కలుషిత నీరు, ఆహారం వల్లే ఒకేసారి అనేకమంది పచ్చకామెర్ల బారిన పడి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.