వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం

Oct 5 2025 2:20 AM | Updated on Oct 5 2025 2:20 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం

ఆగిన 104 బండి

పార్వతీపురం రూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన జమ్మాన ప్రసన్నకుమార్‌, సవరపు జయమణిలను స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్లుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

పార్వతీపురం రూరల్‌: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని పంచాయతీల్లో తాగునీరు క్లోరినేషన్‌ చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా మండ లాధికారులు పర్యవేక్షించాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.హేమలత, మున్సిపల్‌ కమి షనర్లు, డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో పాటు తహసీల్దార్లు పాల్గొన్నారు.

నేను ఆటో డ్రైవర్‌ కొడుకునే...

సీతంపేట: నేను ఆటో డ్రైవర్‌ కొడుకునే.. ఆటో డ్రైవర్ల కుటుంబ పరిస్థితులు, కష్టాలు తెలుసు .. ఆటో నడుపుతూనే మా నాన్న నన్ను చదివించారు.. మీరు కూడా ప్రభుత్వ రాయితీలు, పథకాలు సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను చక్కగా చదివించాలని పాలకొండ సబ్‌కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నా థ్‌ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఐటీడీఏలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆటో నడుపుతూ వచ్చి న డబ్బును కుటుంబ సంక్షేమంతో పాటు పిల్ల ల చదువుకు వెచ్చించాలన్నారు. రవాణా శాఖ నిబంధనలు సక్రమంగా పాటించాలన్నారు. పాలకొండ నియోజకవర్గంలోని 1251 మంది ఆటోడ్రైవర్లకు రూ.1,87,65,000 నమూన చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి, సవర తోట ముఖలింగం, నిమ్మల నిబ్రం, ఎం.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

పాలకొండ రూరల్‌: జీఓ నంబర్‌ 85 రద్దుతో పాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ పీహెచ్‌సీ వైద్యులు సమ్మెబాట పట్టారు. చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడంతో గడిచిన మూడు రోజులుగా పీహెచ్‌సీల్లో వైద్యులేక రోగులకు సేవలు అందడంలేదు. అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతూ నిత్యం పీహెచ్‌సీలకు వెళ్లే రోగుల కష్టాలు వర్ణణాతీంగా మారాయి. 104 సేవలు దూరమయ్యాయి. జిల్లాలోని 15 మండలాల్లో సేవలందించే 29 104 వాహనాలు పీహెచ్‌సీలకే పరిమితం కావ డంతో పల్లెప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అట్టహాసపు సభకు

ఆటోడ్రైవర్ల గైర్హాజరు

కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార హోరుకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి స్పందన కరువైందనేందుకు ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. పార్వతీపురంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమానికి ఆ వర్గం నుంచే స్పందన కరువైంది. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం లేకపోవడంతో మాట్లాడేందుకు నాయకులు సిగ్గుపడిపోయారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి జిల్లాలో 5,217 మంది లబ్ధిదారులకు ఆటో డ్రైవర్ల సేవ కింద రూ. 7.82 కోట్లు ప్రయోజనం కల్పిస్తున్నట్టు వెల్ల డించారు. సీ్త్రశక్తితో ఉపాధి లేకుండా చేసి ఏడాదిన్నర తర్వాత అరకొర సాయం చేసి కూటమి నేతల ప్రచార ఆర్భాటం చేయడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

– పార్వతీపురం రూరల్‌

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం1
1/2

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం2
2/2

వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement