
మంచినీరు కరువాయె..
● నాడు ప్రభుత్వ బడుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లతో తాగునీరు
● నేడు నిర్వహణ లేక మూతపడిన ప్లాంట్లు..
● విద్యార్థులకు అందని సురక్షిత నీరు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కరువైంది. సురక్షితమైన తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. తల్లిదండ్రులు ధైర్యంగా బడులకు పిల్లలను పంపించే రోజుల నుంచి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. నాడు–నేడు పథకం నిధులతో ప్రభుత్వ బడులు, సంక్షేమ, గురుకుల పాఠశాలలకు మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.లక్షల వ్యయంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు నేడు నిర్వహణలేక మూలకు చేరాయి. విద్యార్థులు అందుబాటులో ఉన్న కలుషిత నీటిటి తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

మంచినీరు కరువాయె..

మంచినీరు కరువాయె..