
7న చలో విజయవాడ
● పోస్టర్లు ఆవిష్కరించిన ఉపాధ్యాయ
సంఘాల నాయకులు
వీరఘట్టం: విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 7న చలో విజయవాడ కార్యక్రమం ద్వారా పోరుబాటకు సమర శంఖారావాన్ని పూరించాయి. ఈ మేరకు శనివారం వీరఘట్టం ఎమ్మార్సీ వద్ద చలో విజయవాడ పోస్టర్లను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరగా విస్మరించడంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని ఫ్యాప్టో నాయకులు మజ్జి పైడిరాజు, ఎం.మురళీ, ఆర్.ధనుంజయనాయుడు, ఎ.సూర్యనారాయణ, వి.అన్నాజీ, నరహరి తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 20 డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు.
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖంపడుతోంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 44వేల క్యూసెక్కుల వరదనీరు చేరగా.. శనివారం సాయంత్రం నాటికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతూ 11,637 క్యూసెక్కులకు చేరింది. అధికారులు స్పిల్‌వే వద్ద మూడు గేట్లను ఎత్తివేసి 10,617 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టారు.

7న చలో విజయవాడ