వ్యక్తి ఆత్మహత్య... | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య...

Oct 4 2025 6:38 AM | Updated on Oct 4 2025 6:38 AM

 వ్యక

వ్యక్తి ఆత్మహత్య...

వ్యక్తి ఆత్మహత్య... మరో వ్యక్తి.. రైలు ఢీకొని ఒకరు.. మద్యం అనుకొని పురుగుల మందు తాగి... బావిలో పడి ఒకరు... గోడ కూలి ఒకరు... గుర్తు తెలియని వాహనం ఢీకొని... భైక్‌ బోల్తా పడి వ్యక్తి దుర్మరణం అనుమానాస్పద స్థితిలో కార్మికుడు..

చికెన్‌

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ140 శ్రీ250 శ్రీ260

విజయనగరం క్రైమ్‌ : నగరంలోని సూర్యనగర్‌లో మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి హెచ్‌సీ అప్పలనాయుడు తెలిపిన వివరాలు.. అప్పలనాయుడు(38) మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. అదే సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. చివరకు అప్పులు బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు హెచ్‌సీ తెలిపారు.

సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన పెరుమాళి సింహాచలం(57) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణారాయపురం గ్రామానికి చెందిన సింహాచలం బుధవారం బొబ్బిలిలోని కుమార్తె ఇంటికి త్వరలో నిర్వహించనున్న నందెన్న ఉత్సవాలపై మాట్లాడేందుకు వెళ్లాడు. అక్కడ పిల్లలు తన మాట వినడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో కొన్న పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భార్య గౌరీ, కుమారుడు కలిసి చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. భార్య పెరుమాళి గౌరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.రాజేష్‌ తెలిపారు.

పార్వతీపురం రూరల్‌: బహిర్భూమికని వెళ్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో నర్సిపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో గల ఎల్‌సీ గేటు వద్ద గల ఇదే గ్రామానికి చెందిన చందాన సింహాచలం (59) పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో బలమైన గాయాలు తగిలి అక్కడకక్కడే మృతి చెందినట్టు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ బి.ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రామభద్రపురం: మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన వ్యక్తి మందు అనుకొని పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల రామకృష్ణ (47) మండల కేంద్రంలోని ఆల్టాటెక్‌ సిమెంట్‌ గోదాంలో కళాసీగా పని చేస్తున్నాడు. ఈ నెల 28న మద్యం సీసా కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. ముందు రోజు పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేసి మిగిలిన మందు దగ్గర మద్యం సీసా పెట్టాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మద్యం సీసా అనుకొని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రధమ చికిత్స నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భార్య సింహాచలం ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బావిలో నీళ్లు తొడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి బావిలో పడి మృతి చెందారు. ఎస్‌ఐ అశోక్‌ శుక్రవారం తెలిపిన వివరాలు.. బియ్యాలపేటకు చెందిన చుక్క ఈశ్వరరావు(37) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటికి అవసరం నిమిత్తం నీళ్ల కోసం గురువారం సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. నీళ్ల కోసం వెళ్లిన భర్త ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్య అప్పయ్యమ్మ బావి వద్దకు వెళ్లింది. అక్కడ బావిలో ఈశ్వరరావు మృతదేహమై కనిపించాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

కురుపాం: మండలంలో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి ఉదయపురం పంచాయతీలోని ఉదయపురం కాలనీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లపై శుక్రవారం ఉదయం మట్టి గోడ కూలడంతో కుంబురిక అరవింద్‌(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వినయ్‌ను స్థానికులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సంఘటనపై నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామంలో శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన వంజరాపు సుబ్బినాయుడు (65) వేకువజామున 4గంటల సమయంలో కాగితాపల్లి వైపు బహిర్భూమికి వెళ్తున్నాడు. అదే సమయంలో రాజాం నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే బోర్లా పడ్డాడు. కొంత సమయం అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో గుర్తించలేదు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది అటుగా వెళ్లి బోర్లా పడి ఉన్న వ్యక్తిని చూసే సరికి తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు సుబ్బినాయుడుకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో భార్య బోరున విలపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సీతంపేట: దసరా పండగ పూట సరదాగా గడుపుదామని హైదారాబాద్‌ నుంచి స్వగ్రామమైన పాలకొండ వచ్చి అక్కడ నుంచి సీతంపేట జగతపల్లి వ్యూ పాయింట్‌ చూడడానికి వచ్చిన పాలకొండకు చెందిన సాహిని సాయికృష్ణ (28) ద్విచక్ర వాహనం ఘాట్‌రోడ్‌లో అదుపుతప్పి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న మృతుడు కొద్ది రోజుల కిందట స్వగ్రామమైన పాలకొండకు వచ్చాడు. తన స్నేహితులతో కలసి మండలంలోని జగతపల్లి వ్యూ పాయింట్‌కు వచ్చారు. వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి జగతపల్లి మలుపు వద్ద బోల్తా పడింది. భూరి అభిలాష్‌ డ్రైవ్‌ చేస్తుండగా వెనుక ఉన్న సాయికృష్ణకు తలపై తీవ్ర గాయమవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్య సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం దసరా రోజున మృతి చెందినట్టు ఎస్‌ఐ వై.అమ్మన్నరావు తెలిపారు. మృతునికి తల్లి, సోదరుడు వంశీకృష్ణ ఉన్నారు. ఈయన మృతితో పాలకొండలోని కోటదుర్గమ్మ కాలనీలో విషాదం నెలకొంది. పండగపూట ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరై విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహానికి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు.

కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారానికి చెందిన కాంట్రాక్టు కార్మికుడు తమటపు రాము(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకొంది. మృతుడు కుటుంబీకులు, సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. మండలంలోని బలిఘట్టాం గ్రామానికి చెందిన తమటపు రాము గతంలో జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కర్మాగారంలో పని చేసేవాడు. కర్మాగారాన్ని గత ఏడాది అర్ధాంతరంగా మూసేయండంతో కంటకాపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్మాగారంలో ఒక కాంట్రాక్టుర్‌ వద్ద హౌస్‌ కీపింగ్‌ పనుల నిర్వహణకు జాయిన్‌ అయ్యాడు. గురువారం దసరా పండగ అయినప్పటికీ కర్మాగారానికి రాము వెళ్లాడు. మధ్యాహ్నం కర్మాగారం సమీపంలో గల చెరువులో పడి మృతి చెందాడు. రాము ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలో వెతకడం ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున కర్మాగారం సమీపంలో గల చెరువులో శవమై తేలాడు. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్ఛారు. కర్మాగారంలో విధులకు హాజరై అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో బంధువులు భోరుమని విలపించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు.

క్రైమ్‌ కార్నర్‌

 వ్యక్తి ఆత్మహత్య... 1
1/6

వ్యక్తి ఆత్మహత్య...

 వ్యక్తి ఆత్మహత్య... 2
2/6

వ్యక్తి ఆత్మహత్య...

 వ్యక్తి ఆత్మహత్య... 3
3/6

వ్యక్తి ఆత్మహత్య...

 వ్యక్తి ఆత్మహత్య... 4
4/6

వ్యక్తి ఆత్మహత్య...

 వ్యక్తి ఆత్మహత్య... 5
5/6

వ్యక్తి ఆత్మహత్య...

 వ్యక్తి ఆత్మహత్య... 6
6/6

వ్యక్తి ఆత్మహత్య...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement