
అరటి రైతు కుదేలు
వీరఘట్టం: మండల వ్యాప్తంగా గురువారం మధ్యాం కురిసిన భారీ వర్షానికి దశుమంతపురం, కంబరవలస, చిట్టపులివలస, కంబర, నడిమికెల్ల, విక్రమపురం, నడుకూరు, వీరఘట్టం గ్రామాల్లో సుమారు 850 ఎకరాల్లో అరటితోటలు, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరి పంటకు నష్టంవాటిల్లింది. సుమారు రూ.2.50 కోట్లు నష్టం ఉంటుందని అంచనా. పంట నష్టం అంచనా వేస్తు న్నట్టు తహసీల్దార్ ఎ.ఎస్.కామేశ్వరరావు తెలిపా రు. గాలివానతో నాశనమైన పంటలను రైతు సంఘం నాయకుడు బుడితి అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. అరటి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అరటి రైతు కుదేలు