
బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం
పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముందుచూపుతో 17 మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐదు కళాశాలలు పూర్తి చేయగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల అవన్నీ వృథా అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు తన కుమారుడికి అన్ని విధాలా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. పేదల పొట్టకొట్టే విధానాలు అవలంభిస్తున్నారు. బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే.. ఎంతవరకై నా వెళ్తాం.
– గండి భాగ్యవతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి