
తిన్నోళ్లకు తిన్నంత ఉపాధి
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ, సాలూరులోని కామాక్షమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీదేవి జన్మించిన మూలనక్షత్రంను పురస్కరించుకుని అమ్మవార్ల ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కుంకుమ పూజలు జరిపారు. – పాలకొండ/సాలూరు
● వేతనదారుల కడుపుకొట్టి, అక్రమార్కుల బొజ్జ నింపుతున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ ● అధికారులు, ఉద్యోగుల కుమ్మక్కు ● పెద్దఎత్తున నిధులు స్వాహా
ఆదుకోండయ్యా...
సాక్షి, పార్వతీపురం మన్యం:
●గరుగుబిల్లి మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. రూ.20 కోట్ల విలువైన 1,600 పనుల్లో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించారు. చెరువు పనుల కొలతల్లో తేడాలు.. హాజరుకా ని వారికి వేతనాల చెల్లింపులు.. ఒకే కుటుంబానికి రెండేసి జాబ్ కార్డులు ఇవ్వడం వంటివి గుర్తించారు. నాగూరు, మరుపెంట క్షేత్ర సహా యకులు ఎక్కువగా అక్రమాలకు పాల్పడ్డార ని.. వారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.●
●బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో పలువురికి ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని 2022లో నిర్మించుకున్నారు. వీరికి ఎన్‌ఆర్‌ఆజీఎస్ పథకం నుంచి ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రావాల్సి ఉంది. ఆ మొత్తం కోసం ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఎన్నిసార్లు అడిగినా.. ప్రభుత్వం నుంచి నిధు లు రాలేదంటూ చెప్పుకొచ్చారు. దీనిపై వారు ఆరా తీస్తే.. వీరి మస్తర్లను వేరొకరి పేరుతో వేసి సొమ్ము పక్కదారి పట్టించినట్లు తెలిసింది. దీనిపై ఏపీవో, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు పూడి గంగమ్మ, సురగాల చిన్నమ్మ, సత్యవతి, కరుణ మ్మ, పెద్దింటి లక్ష్మి తదితరులు చెబుతున్నారు. ఇలా గ్రామంలో 30 నుంచి 40 మందికి సంబంధించి బినామీ మస్తర్లతో నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ●
గ్రామీణ ప్రాంత పేదలకు పని భద్రత కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆ శాఖలోని అధికారుల కు, క్షేత్ర స్థాయి సిబ్బందికి వరంలా మారుతోంది. వేతనదారుల కడుపుకొట్టి.. వారి బొజ్జలు నింపు కొంటున్నారు. ప్రధానంగా ఉపాధి పనుల కొలత ల్లో తేడాలు, తప్పుడు మస్తర్లు వేయడం.. దస్త్రాల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడం.. బిల్లుల స్వాహా.. ఇలా ఒక్కటేమిటి అందివచ్చిన ఏ అవకాశాన్నీ సిబ్బంది వదల డం లేదు. ఇటీవల గరుగుబిల్లి మండలంలో పనుల కు సంబంధించి చేపట్టిన సామాజిక తనిఖీల్లో సుమారు రూ.2 లక్షల వరకు కొలతల్లో తేడాలు, బినామీ మస్తర్లను గుర్తించారు. పనిచేయని లబ్ధిదారులకు విత్ హోల్డ్ బిల్లులు దాదాపు రూ. 5 లక్షల వరకు క్షేత్రసహాయకులు స్వాహా చేశారు. పంట పొలాలకు సంబంధించి సాగునీరు వెళ్లే పిల్ల కాలువల కొలతల్లో ఎక్కువ నమోదు చేసి, బిల్లులు పక్కదారి పట్టించారు. జిల్లాలో అనేక చోట్ల అనర్హు లకు జాబ్ కార్డులున్నాయి. గ్రామాల్లో ఎవరికై నా జాబ్ కార్డు కావాలంటే రూ.వెయ్యి చొప్పున వసూ లు చేస్తున్నారు. పనులు కల్పించాలంటే.. వారానికి రూ. వంద చొప్పున ఒక్కో వేతనదారు నుంచి కలెక్షన్ చేస్తున్నారు. బలిజిపేట మండలం పెదపెంకిలో తప్పుడు మస్తర్లు వేసి, పెద్ద ఎత్తున నిధుల స్వాహాపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత సిబ్బంది రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జిల్లాలో 4 లక్షల మందికిపైగా వేతన దారులు ఉన్నా రు. 2.15 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఏటా పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఉపాధి నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సన్న, చిన్నకారు రైతుల పంట భూముల్లో పండ్ల తోటలతో పాటు.. రహదారుల పక్కన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎకరా పొలంలో సుమారు 70 మొక్కలు నాటేందుకు రూ. 95 వేల వరకూ సాయం అంది స్తారు. లెక్కల్లో పనులైతే చూపిస్తున్నారు గానీ.. నిధులు అక్రమార్కులకే కడుపు నింపుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి అధికారుల స్థాయి వరకూ ఆదాయ వనరుగా ఉపాధి పథకం మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాకు ముగ్గురు కుమార్తెలు.. కాయకష్టంతో ఇద్దరికి వివాహాలు చేశాను.. మూడో కుమెర్తె పైడి పుట్టుకతోనే వినికిడిలోపంతో పాటు మూగది. ఇంటర్ చదువుకున్న కుమార్తెకు ఉపాధి కల్పించడంతో పాటు వినికిడి యంత్రం అందజేయాలంటూ బలిజిపేట మండలం తుమరాడ గ్రామానికి చెందిన మర్రాపు అమ్మడమ్మ కలెక్టర్‌కు విన్నవించింది.
పార్వతీపురం రూరల్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పలు సమ స్యలపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు. ఆదుకోవాలంటూ వేడుకున్నారు.
గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా రూ.35.89 కోట్లతో చేపట్టిన 2,939 అభివృద్ధి పనుల్లో వివిధ దశల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. చెముడుగూడలో చేపట్టిన ఫారంపాండ్లో ఆరు పనులు చేపట్టకుండానే రూ. 1.20 లక్షల బిల్లులు డ్రా చేశారు. నెల్లికెక్కువ గ్రామంలో పనికి వెళ్లకుండా 10 మందికి మస్తర్లు వేసి కూలి డబ్బులు చెల్లించారు. దొరజమ్ము ఆశ్రమ పాఠశాల ఆవరణలో చేపట్టిన రక్షణ గోడకు సంబంధించిన రూ.1.20 లక్షలు, బీటీ రహదారులకు సంబంధించిన బిల్లులు వెండరుకు ఇవ్వకుండా, అధికారుల ఖాతాల్లోకి జమ అయ్యాయి.

తిన్నోళ్లకు తిన్నంత ఉపాధి

తిన్నోళ్లకు తిన్నంత ఉపాధి

తిన్నోళ్లకు తిన్నంత ఉపాధి