
వైద్యుల సమ్మె సైరన్
డాక్టర్ల సమ్మెతో
వెలవెలబోయిన పీహెచ్‌సీ
గుమ్మలక్ష్మీపురం: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు సోమవారం ఓపీ విధులను బహిష్కరించారు. అత్యవసర కేసులకు మాత్రమే వైద్యులు వైద్య సేవలు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో తాడికొండ, దుడ్డుఖల్లు, రేగిడి, కురుపాం మండలంలోని మొండెంఖల్లు, నీలకంఠాపురం, కొమరాడ మండలంలోని కొమరాడ, కూనేరు రామభద్రాపురం, మాదలంగి, జియ్యమ్మవలస మండలంలోని జియ్యమ్మవలస, రావాడ రామభద్రాపురం, గరుగుబిల్లి మండలంలోని గరుగుబిల్లి, రావివలస గ్రామాల్లోని పీహెచ్‌సీలు నిర్మానుష్యంగా కనిపించాయి.
వీరఘట్టం: పీహెచ్‌సీ వైద్యుల సమ్మెలో భాగంగా సోమవారం ఓపీ సేవలు బహిష్కరించారు. వీరఘట్టం పీహెచ్‌సీలో 5 ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే చికిత్స అందించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 100 వరకు ఓ.పీ ఉండేది. డాక్డర్ల సమ్మెతో వీరఘట్టం పీహెచ్‌సీ వెలవెలబోయింది. కొందరు రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు.

వైద్యుల సమ్మె సైరన్

వైద్యుల సమ్మె సైరన్

వైద్యుల సమ్మె సైరన్