
సూపర్ జీఎస్టీ, సేవింగ్స్ బ్రోచర్ విడుదల
పార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు చేకూరిన లబ్ధిని తెలియజేసే సూపర్ జీ ఎస్టీ, సూపర్ సేవింగ్స్ బ్రోచర్ కరపత్రాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రజలకు కలిగే లబ్ధిని క్షుణ్ణంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సీతంపేట: సీతంపేటలో సోమవారం జరిగిన వారపు సంత క్రయవిక్రయదారులతో కిక్కిరిసింది. దసరా ముందురోజు సంతకావడంతో పొట్టేళ్లు, నాటుకోళ్ల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. కిలో పైబడి ఉన్న నాటుకోడి పుంజు రూ.1500లు, 15 కిలోల మేక, గొర్రె పోతులు రూ.20వేలు పైబడి ధర పలికాయి.
సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: జిల్లాలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనల మేరకు అప్పగించాలని ఎస్పీదామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీచేశారు. స్టేషన్ ప్రాంగణంలోని వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో మరిన్ని ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చాలని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయించేవారు, మహిళల పట్ల దాడులకు, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ఉన్నారు.

సూపర్ జీఎస్టీ, సేవింగ్స్ బ్రోచర్ విడుదల