
ఏఐటీటీ పరీక్షల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ
సీతంపేట: ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షల్లో స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఒక ఏడాది కోపా (కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్) కోర్సును చదువుతున్న గిరిజన విద్యార్థిని తంబర ఝాన్సీ లక్ష్మీభాయి 600 మార్కులకుగాను 600 సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డ్రెస్ మేకింగ్ కోర్సులో సవర రవీంద్ర 600 మార్కులకుగాను 580 మార్కులు సాధించి దేశంలోనే బాలుర విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో మూటక లావణ్య 1200 మార్కులకుగాను 1193, మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్‌లో సవర చరణ్ 1200 మార్కులకుగాను 1192 మార్కులు సాధించారు. వివిధ ట్రేడ్‌లలో 600మార్కులకుగాను 599, 597, 596 మార్కులు పలువురు విద్యార్థులు సాదించి ప్రతిభ చాటారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మూటక గోపాలకృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.