నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌

Sep 8 2025 4:58 AM | Updated on Sep 8 2025 4:58 AM

నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌

నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌

15 నుంచి జిల్లాలో యూటీఎఫ్‌ రణభేరి టీచర్ల ఆర్థిక బకాయిలు చెల్లించాలి : ఎమ్మెల్సీ

సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నారు. ప్రాజెక్టు అధికారి పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ హాజరు కానున్నారు. సమస్యలను గిరిజనులు వినతుల రూపంలో ఇవ్వవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన

సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ట్రైబుల్‌ వెల్ఫేర్‌ డీడీ అన్నదొర ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భోజన పదార్థాలు పరిశీలించారు. అన్నం, కూరలు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. జ్వరం, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిచెన్‌ గార్డెన్‌, మరుగుదొడ్లు, డార్మెటరీ పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన వెంట హెచ్‌డబ్ల్యూవో పాలక అమల తదితరులు ఉన్నారు.

13న ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఎన్నిక

పార్వతీపురం రూరల్‌: ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ పార్వతీపురం మన్యం జిల్లా యూనిట్‌ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో దీంతో పాటు కలెక్టరేట్‌ యూనిట్‌, పార్వతీపురం, పాలకొండ డివిజన్ల యూనిట్లకు ఈ నెల 13న రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించినట్టు ఆ అసోసియేషన్‌ అధ్యక్ష, కోశాధికారులు గొట్టాపు శ్రీరామ్మూర్తి, పీఎస్‌ఎల్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులను సైతం నియమించినట్టు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో జరగనున్న ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొని సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. ప్రతి యూనిట్‌లో ఒక అధ్యక్ష, సహాధ్యక్షులతో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, ఒక కోశాధికారితో పాటు మరో 14 మంది సభ్యులను ఎన్నుకుంటామని తెలిపారు.

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని, ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణం కల్పించాలన్న డిమాండ్‌తో రణభేరి కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని యూటీఎఫ్‌ జిల్లా కమిటీ ప్రకటించింది. స్థానిక జిల్లా పరిషత్‌ మినిస్టీరియల్‌ సిబ్బంది సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. తొలిత రణభేరి షెడ్యూల్‌ ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ ద్వారా ప్రమోహన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా 3వ రోజున 100 బైక్‌లతో బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ మీదుగా ఎస్‌.కోట వరకు బైక్‌ ర్యాలీ కొనసాగుతుందని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బయలుదేరాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు జేఆర్‌సీపట్నాయక్‌, గౌరవాధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, కె.విజయగౌరి పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు, పీఎఫ్‌ ఇతర ఆర్థ్ధిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్‌ గాదె శ్రీనివాసుల నాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక పీఆర్‌టీ యూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్‌సీ ప్రకటించడానికి ఆలస్యమైన కారణంగా ఐఆర్‌ ఇవ్వాలని ప్రభు త్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు యాప్‌ల వినియోగం వంటి బోధనేతర పనుల ఒత్తిడి తో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగి న సమావేశంలో సంఘం నాయకులు వి.రవీంద్రనాయుడు, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement