
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
పార్వతీపురం రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంటు) నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.