
వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఖేలో ఇండియా అస్మిత వెయిట్ లిఫ్టింగ్ లీగ్ పోటీల్లో శ్రీపాద శ్రీజ ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, మరో విద్యార్ధిని మౌనిక రెండు స్వర్ణపతకాలు దక్కించుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు, చాన్స్‌లర్ జీఎస్‌ఎన్ రాజు, వైస్ చాన్స్‌లర్ పీకే మహంతి, తదితరులు అభినందిచారు.
55 మద్యం సీసాల పట్టివేత
రాజాం: రాజాం ప్రొహిభిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో అనధికారిక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్‌శాఖ రాజాం సీఐ ఆర్.జైభీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో మూడురోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదుచేసి 55 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, సీజ్ చేశామని చెప్పారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.

వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు