
చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
విజయనగరం టౌన్: చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం నూతన కార్యవర్గాన్ని ఆదివారం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా కేకే జగన్నాథ్, ఉపాధ్యక్షులుగా సాగి జానకీరామ్‌రాజు, డాక్టర్ పైల రమేష్ కుమార్, కార్యదర్శిగా కరణం భాస్కరరావు, సహ కార్యదర్శులుగా కాళ్ల లీలా ప్రసాదరావు, సంభాన శ్రీధర్, కోశాధికారిగా బైరెడ్డి సన్యాసినాయుడు, మెంబర్లుగా జి.లక్ష్మీ గాయత్రి దేవి, ఎల్.రమ, డి.రమేష్, ఎన్.పద్మావతి, ఎంజేవీఎస్‌ఎన్.తాడిరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారింగా ఎం.పీటర్ మార్టిన్ వ్యవహరించి కొత్త కార్యవర్గసభ్యులను ఎంపిక చేశారు. ఎంపికై న సభ్యులందరినీ అసోసియేషన్ అభినందించింది.