
తల్లిపేరు మార్చేస్తే ఎలా?
నేను ఆటో డ్రైవర్‌ను. నా కుమార్తె తనుశ్రీ ఆరవ తరగతి చదువుతోంది. భార్యపేరు పద్మావతి. నా బిడ్డకు తల్లికి వందనం వర్తించ లేదు. కారణం తెలుసుకుంటే నా భార్య పేరు స్థానంలో కిల్లో స్వప్న పేరు నమోదైంది. ఆమె పేరున ఎక్కువ ఆస్తులు ఉండడంతో పథకానికి అనర్హులని చూపిస్తోంది. ఈ స్వప్న ఎవరని నా భార్య ప్రశ్నిస్తోంది. సాంకేతిక సమస్య కుటుంబాల్లో చిచ్చుపెట్టేలా ఉంది. అసలు ఈ స్వప్న ఎవరన్నది అధికారులు నిగ్గు తేల్చాలి. ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కారం చూపి అర్హులకు తల్లికివందనం పథకం వర్తింపజేయాలి.
– బెజ్జి లక్ష్మునాయుడు,
ఓని గ్రామం, పాలకొండ మండలం
●