
సమస్యలకే వసతి..!
పార్వతీపురంటౌన్/భామిని/పార్వతీపురం రూరల్ / సీతంపేట/పాలకొండ/గుమ్మలక్ష్మీపురం:
పేద విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. జిల్లాలో సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు సమస్యలతో సతమవుతున్నారు. తాగడానికి, వినియోగానికి నీరు, ఉండటానికి సరిపడా వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గదిలో దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఉండాల్సిన పరిస్థితి. జిల్లాలో సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలు మొత్తం 450 ఉన్నాయి. వీటిలో 26,415 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థులకు బయటకు పరిగెత్తాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వసతి గృహాల్లో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అద్దె చెల్లిస్తున్నా వసతులు శూన్యం
జిల్లలోని కొన్ని పసతి గృహాలను అద్దెభవనాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కోవసతి గృహానికి నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్నా సరైన వసతులు మాత్రం లేవు. గదులకు తలుపులు, కిటీకీలు కూడా లేవు. దోమల బెడదతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు అయితే జాగారం చేయాల్సిన పరిస్థితి.
పర్యవేక్షణ శూన్యం
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యార్థులకు మోనూ ప్రకారం భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల డైరెక్టర్, సహాయ సంక్షేమ అధికారులపై ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు వసతులు సరిగా అందడంలేదు.
జిల్లాలోని వసతిగృహాల విద్యార్థులను పట్టిపీడిస్తున్న సమస్యలు
తాగునీరు, మరుగుదొడ్ల కష్టాలు
నేలపైనే నిద్ర
పట్టించుకోని ప్రభుత్వం
ఒక్కోగదిలో 20 మంది ఉండాల్సిన దుస్థితి
జిల్లాలో 450 వసతిగృహాల్లో 26,415 మంది విద్యార్థులు
పార్వతీపురం గిరిజన సంక్షేమ పోస్టుమెట్రిక్ వసతి గృహంలో చదువు, నిద్ర అన్నీ ఒకచోటే...

సమస్యలకే వసతి..!

సమస్యలకే వసతి..!