
మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్ట నిఘా
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టరు ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ, రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, సరఫరా చేసేవారికి విధిగా శిక్షలు పడేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతం, బస్సులు, ఇతర వాహనాల ద్వారా జరిగే మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు జిల్లా యంత్రాంగంతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. ఏఎస్పీ సురాన అంకిత్ మహావీర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, డీఎస్పీ ఎం.రాంబాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.సంతోష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీఎస్పీల మృతికి సంతాపం
రహదారి ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు డీఎస్పీల మృతి పట్ల అధికారులు సంతాపం తెలిపారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.