
త్వరితగతిన జన్‌మాన్ రహదారుల పనులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పీఎం జన్‌మాన్ కింద మంజూరైన రహదారి పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అవసరమైన ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ కింద అనుసంధానం పనులను మంజూరు చేస్తామని చెప్పారు. సామాజిక మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. జల వనరుల శాఖ కింద జరుగుతున్న పనులను సకాలంలో పూర్తి చేసి ఖరీఫ్, రబీలకు ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల ప్రాణాలు కాపాడండి
పార్వతీపురం రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహల్లో గిరిజన విద్యార్థులకు గతంలో వైద్య సేవలు అందించిన ఆదివాసీ ఆరోగ్య సిబ్బందిని విధుల్లోకి తీసుకుని గిరిజన విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, పీడీఎస్‌ఓ జిల్లా కన్వీనర్ కొండతామర సోమేశ్, కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మండలాధ్యక్షుడు తీళ్ల గౌరీశంకరరావు డిమాండ్‌చేశారు. పార్వతీపురం మ న్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ఆరో రోజు నిరసన దీక్షలో వారికి మద్దతుగా పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు వైద్యసేవలందించేందుకు ఏఎన్‌ఎంలను నియమించాలన్నారు. నిరసన దీక్షలో రాజేశ్వరి, చిన్నమ్మి, స్వాతి, గౌరీశ్వరి, లక్ష్మి, నందిని, గౌ రమ్మ, రమణమ్మ, చంద్రకళ, సుజాత, అరుణ, నాగలక్ష్మి, సుజాత, లలిత, పాల్గొన్నారు.

త్వరితగతిన జన్‌మాన్ రహదారుల పనులు