
నా బిడ్డకు ఆమెవరో తల్లి అట..
నా కుమారుడు హేమసుందర్‌కు రూ.13వేలు వచ్చాయి. కుమార్తె సుమతికి లబ్ధి వర్తించ లేదు. గతంలో సచివాలయంలో ఫిర్యాదు చేశాం. అర్హత పొందారు, త్వరలో నగదు జమ చేస్తారని అక్కడి సిబ్బంది చెప్పారు. ఇప్పుడు అర్హత లేదంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే నా కుమర్తెకు తల్లిగా కిల్లో స్వప్న పేరు వస్తుంది. ఈ పేరు మీద కారు, భూములు, అధిక విద్యుత్ బిల్లులు ఇలా పలు కారణాలు చూపిస్తున్నాయి. మాది మధ్య తర గతి కుటుంబం. భర్త సాగర్ చనిపోయారు. టైలరింగ్ చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నా. నా బిడ్డకు ఆమెవరో తల్లి అంటున్నారు. ఇదెక్కడి అన్యాయం.
– దుప్పాడ వరలక్ష్మి, బాదితురాలు, పాలకొండ
●