● విజయనగరం విధ్వంసానికి పథక రచన ● తవ్వేకొద్దీ బయటకొస్తు
జూన్ 10 నాటికి
గృహ నిర్మాణాలు పూర్తికావాలి
● హౌసింగ్ జీఎం వెంకటరమణ
పార్వతీపురం రూరల్: పేదలకోసం నిర్మించే గృహాలను జూన్ 10 నాటికి పూర్తిచేయాలని గృహ నిర్మాణ శాఖ జీఎం, మూడు జిల్లాల హౌసింగ్ ప్రత్యేకాధికారి వెంకటరమణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మండ లం నర్సిపురం లే అవుట్‌ను శుక్రవారం సందర్శించారు. గృహనిర్మాణ లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో హౌసింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్, ఇతర సామగ్రికి కొరత లేదన్నారు. నీటి సౌలభ్యం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. సమావేశంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్, హౌసింగ్ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.
జీకేఆర్ పురం నుంచి జపాన్‌కు..
బాడంగి: మండలంలోని జీకేఆర్ పురం గ్రామానికి చెందిన ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ల కళాకారుడు నీలబోను సత్యం బృందానికి జపాన్ నుంచి పిలుపు అందింది. జపాన్ లో తప్పెటగుళ్ల ప్రదర్శన ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అవకా శం కల్పించింది. ఇక్కడ నుంచి ఆయనతో పాటు ఆరుగురు కళాకారులు శనివా రం జపాన్ చేరుకుంటారు. అక్కడ మన దేశం తరఫున ప్రదర్శన ఇవ్వనున్నారు. జపాన్‌లో ఈ నెల 25 నుంచి 30వ తేదీవరకు నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనల్లో తప్పెటగుళ్ల కళను ప్రదర్శిస్తామని సత్యం తెలిపారు. ఇతర దేశాలకు తమ కళను పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.
మతోన్మాద శక్తులతో
చేతులు కలిపి...
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను అందరిలాంటి విద్యార్థిగానే ఆ వీధివాసులు భావించారు. పోటీ పరీక్షలకు చదువుతుంటే మంచి విద్యార్థిగానే నమ్మారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ నెల 16న అరెస్టు చేశాక ఆయనలోని ఉగ్రవాద భావజాలం తెలిసి నిశ్చేష్టులయ్యారు. జన్మనిచ్చిన స్థలం, ప్రశాంతతకు నిలయం.. అన్నిమతాల వారు ఆనందంగా జీవించేందుకు అనువైన.. కళలకు కాణాచిగా ఉన్న విజయనగరాన్ని ధ్వంసం చేసేందుకు పథక రచన చేశాడన్న వార్తతో ఉలిక్కిపడ్డారు. పోలీసుల రిమాండ్ నివేదికలో ఆయన అంగీకరించిన అంశాలను తెలుసుకుని అమ్మో అంటున్నారు. మతోన్మాద శక్తులతో కలిసి సిరాజ్, సమీర్‌ల ఉగ్రకోణంపై ఎన్‌ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు కూపీలాగుతున్నారు. విశాఖ సెంట్రల్ జైల్ నుంచి శుక్రవారం కస్టడీకి తీసుకున్న పోలీసులు సౌదీతో వారికి ఉన్న సంబంధాలు, ప్రత్యేక యాప్‌లో చేసిన చాటింగ్‌లపై ఆరా తీసున్నారు. ఆరేళ్లుగా దేశంలోని ముంబయి, ఉత్తరప్రదేశ్ తదితర చోట్ల జరిగిన మత సమ్మేళనాలకు వీరిద్దరూ హాజరై అక్కడ కలిసిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచేందుకు మజ్వా–ఇ–హింద్ స్థాపించాలని నిర్ణయించడం, దేశం మొత్తం అలజడు లు సృష్టించేందుకు పథకరచన చేయడంపై ఆరా తీస్తున్నారు. ఇద్దరి ఉగ్రవాద కుట్రకోణా లను వారం రోజుల్లో సేకరించే దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నట్టు సమాచారం.


