
కోటిపాం వంతెనపై వినూత్న నిరసన
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్ రాష్ట్ర రహదారి పూర్తిగా గోతులు మయం అయింది. వాహన చోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలు తరచూ మరమ్మతుల కు గురై రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. 1933లో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనికి నిరసనగా సీపీఎం నాయకు డు కొల్లు సాంభమూర్తి వంతెనపై గోతుల్లో చేరిన వర్షపునీటిలో శుక్రవారం స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మూడు రాష్ట్రాల ప్రజ లు, వాహనాల రాకపోకలకు ఆధారమైన కోటి పాం వంతెన కూలేపోయే దశలో ఉన్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. పాలకులు, అధికా రులు కళ్లుతెరిచి చూడాలని కోరారు. కనీసం గోతులను పూడ్చాలని డిమాండ్ చేశారు.