
అంతన్నారు.. ఇంతన్నారు..
–10లో
జాడ లేని సంక్షేమం..!
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పొట్టకొట్టింది. కార్మికుల సంక్షేమ బోర్డులోని నిధులను
దారి మళ్లించింది.
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
పండగలో విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మూడు రోజులపాటు స్థానిక ప్రజలు, బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సహనం నశించిన పలు వీధుల్లోని ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు పట్టుకుని.. సంధ్యారాణి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పండగకు రెండు రోజులు ఉందామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఇక్కడ నీరు, కరెంటు లేక రాత్రికి రాత్రే పయనమవ్వడం కనిపించింది. మంగళవారం సిరిమానోత్సవం తర్వాత కొన్ని వీధులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ.. మరికొన్ని వీధులకు బుధవారం రాత్రి వరకు ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన నాయుడువీధి వాసులు.. ఎలక్ట్రికల్ డీఈఈ రంగారావును రామమందిరంలో నిర్బంధించి, తాళం వేశారు. వాస్తవానికి శ్యామలాంబ ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ లోడును తట్టుకునేలా ముందస్తుగా రూ.1.24 కోట్ల వ్యయంతో అయిదు 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 14, రెండు సింగిల్ ఫేజ్ 16కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఉత్సవ సమయంలో ఒక ఎస్‌ఈ, ఈఈ, ఏడుగురు డీఈఈలు, ఆరుగురు ఏఈలు, ఆరుగురు జూనియర్ ఇంజినీర్లు, 57 మంది ఓఎం సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ, పనిచేసినా కష్టాలు తప్పలేదు. ఉత్సవంలో భాగంగా కొన్ని వీధులకే విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మూడు రోజులూ సరఫరా లేక ప్రజలు నరకయాతన చవిచూశారు. భోను, మజ్జుల, తోటవీధులకు గురువారం రాత్రికి కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్డుపై టైర్లు కాల్చారు. మంత్రికి వ్యతిరేకంగా నినదించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: సాలూరు ప్రజల ఆరాధ్య దైవం శ్యామలాంబ ఉత్సవం 15 ఏళ్ల తర్వాత జరగడంతో ఆ ప్రాంత వాసులంతా ఎంతగానో సంతోషించారు. ఎక్కడెక్కడో ఉంటున్న తమ ఇంటి పిల్లలను, బంధువులను, స్నేహితులను పిలిచారు. రెండు లక్షల మందికిపైగా పండగకు వస్తారని ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఊహించారు. ఉత్సవం ఎటువంటి లోటుపాట్లూ లేకుండా నిర్వహిస్తామని ఊదరగొట్టారు. స్వయంగా స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. సంధ్యమ్మ వచ్చింది.. పండగ తెచ్చిందంటూ వీధివీధినా ఫ్లెక్సీలు వేయించారు. సోమవారం నుంచి బుధవారం జరిగిన పండగలో అడుగడుగునా అవరోధాలే. మంచినీటి సరఫరా మొదలు విద్యుత్ అంతరాయం వరకూ.. అస్తవ్యస్త ట్రాఫిక్.. ఇలా స్థానిక ప్రజలతోపాటు, పండగకు వచ్చే వారికి పరీక్షలు పెట్టాయి. ప్రణాళికాలోపం.. పట్టణ ప్రజలకు శాపంగా మారింది. చుట్టుపక్కల జరిగే ఏ పండగలోనూ మునుపెన్నడూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం చోటుచేసుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చివరికి సాలూరు తొలిసారిగా ఆ పేరు దక్కించుకుంది.
డమ్మీగా మారిన ఉత్సవ కమిటీ...
పండగ మొత్తం మంత్రి సంధ్యారాణి అంతా తానై నడిపించారు. ఉత్సవ కమిటీని డమ్మీ చేశారు. అధికారులతో ఒకట్రెండు సమావేశాలు నిర్వహించారు. సమన్వయ సమావేశం ఒక్కసారి కూడా నిర్వహించలేదు. సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పండగ రోజుల్లో వేలాది మంది జనసందోహంలోనే మంత్రి నాలుగు వాహనాల కాన్వాయ్‌తో వచ్చేవారు. ఇంతమంది జనాల్లో వాహన శ్రేణిలో రావడమేమిటని భక్తులు చర్చించుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమైంది. ఎన్నడూ లేని విధంగా కొన్ని ఆచారాలకు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉత్సవాలు జరిగా యన్న విమర్శలున్నాయి. ఉత్సవ కమిటీని కీలుబొమ్మలా మార్చేశారు. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అనుభవం లేని వ్యక్తిని నియమించారన్న ఆరోపణలున్నాయి. ఏకపక్షంగానే నియామకమైన కమిటీ.. కేవలం టీడీపీ కమిటీగానే ముద్రపడింది. పెద్దలు నిర్ణయించిన ప్రకారం సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం 4.05 నిమిషాలకు ప్రారంభం కావాలి. మంత్రి సాయంత్రం 6 గంటలకు వచ్చారు. ఆమె వచ్చిన తర్వాతనే ప్రారంభమైంది. దీనివల్ల సిరిమానోత్సవం ఆలస్యమైంది. సిరిమా ను పూజారి సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లువీధి రామమందిరం నుంచి ప్రారంభమైన కొద్దిసేపటికే అంజలి రథం చక్రం విరిగిపోవడంతో ఆగిపోయింది. మొత్తం సిరిమాను ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి బుధవారం తెల్లవారుజామున 3 గంటలైంది. ఉత్సవ కమిటీ అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపించింది. చివరికి తప్పంతా మున్సి పల్ పాలకవర్గంపై నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. పండగ విజయవంతమైతే అంతా తమ గొప్పతనంగా అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకునేవారు. ఫెయిలవ్వడంతో మున్సిపల్ పాలకవర్గంలో ఖాతాలోకి నెట్టేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
సాలూరు మెయిన్ రోడ్డుపై ఆందోళన చేస్తున్న భోను, మజ్జుల, తోటవీఽధి ప్రజలు
న్యూస్‌రీల్
కాంట్రాక్టరు నిర్వాకమేనా?
అసలే వేసవి కాలం..
ఆపై కరెంటు కష్టం
శ్యామలాంబ పండగ ఏర్పాట్లలో ఘోర వైఫల్యం
15 ఏళ్ల తర్వాత నిర్వహించిన పండగకు భారీగా తరలివచ్చిన భక్తులు
ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించిన మంత్రి సంధ్యారాణి
కనీసం నీరు, విద్యుత్ కూడా అందించలేకపోయిన వైనం
పండగ వేళ సాలూరులో చీకట్లు
వచ్చిన బంధువులకు మర్యాదలు చేయలేకపోయామని ఆవేదనతో రోడ్డెక్కిన ప్రజలు
ఉత్సవం నేపథ్యంలో విద్యుత్ శాఖ తరఫున పనులు చేపట్టగా.. అవన్నీ కాంట్రాక్టరుకు అప్పగించినట్లు తెలిసింది. సదరు కాంట్రాక్టరు కాసులకు కక్కుర్తిపడి నాసిరకం పనులు చేశారన్న విమర్శలు పట్టణ ప్రజల నుంచి వినిపించాయి. ఐదు 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు 40 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు, రెండు సింగిల్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీనికి కారణం అధిక లోడు అని ఆ శాఖాధికారులు అంటున్నారు. విపరీతమైన ఎయిర్ కండీషనర్లు, కూలర్లు, వాటర్ మోటార్లు, మిక్సీలు, గ్రైండర్లు వాడటం వల్లే లోడు పెరిగి.. సెక్షన్ ఫ్యూజులు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని వివరణ ఇస్తున్నారు. భారీ వర్షాలు కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. విద్యుత్ అంతరాయంతో మోటార్లు పని చేయక తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. వాడకానికి కూడా నీరు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అటు విద్యుత్తు లేక.. ఇటు నీరు రాక.. బంధువులను పిలిచి కనీస మర్యాదలు కూడా చేయలేకపోయామని ఆవేదనతో ప్రజలు రోడ్డెక్కారు.

అంతన్నారు.. ఇంతన్నారు..