పార్వతీపురంటౌన్: ఉత్తమ పర్యాటక ఛాయాచిత్రాలను పర్యాటకశాఖ ఆహ్వానిస్తోందని టూరిజం అధికారి ఎన్.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫొటోగ్రాఫర్‌లు, కథకులు, ప్రభావశీలురు, పౌరులు భారతదేశ సాంస్కృతిక, సహజవారసత్వ సారాంశాన్ని సంగ్రహించే ఉత్తమ ఛాయా చిత్రాలను సమర్పించాలని కోరారు. పర్యాటక మంత్రిత్వశాఖ దేఖో అపనా దేశ్– పీపుల్ చాయిస్ –2024 నినాదం కింద మార్చి 7న దేఖో అపనా దేశ్ ఫోటో కాంటెస్ట్‌ను ప్రారంభించిందని దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పర్యాటక ప్రాంతాల గొప్పతనాన్ని చాటండం, ప్రవర్శించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అన్ని రాష్ట్రాలు తమ చురుకై న భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని, పర్యాటక గమ్యస్థానాలు, తమ పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, సందర్శకులను ఆకర్షించడానికి ఇది ఒక విలువైన వేదిక కానుందని తెలిపారు. ఎంట్రీల సమర్పణకు చివరితేది ఏప్రిల్ 7 అని తెలిపారు. స్థానిక ఫొటోగ్రాఫర్‌లు, పౌరులు, టూరిజం బోర్డుల ఇతర సంబంధిత భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి మంచి అవకాశఽమని తెలియజేశారు.