చీపురుపల్లి రూరల్(గరివిడి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసులనాయుడు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. గరివిడిలో శ్రీ చైతన్య పాఠశాల ఆవరణంలో నిర్వహించిన డా.బీఎస్.రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావిధానంలో ఉన్నత భవిష్యత్తుకు చదువు ఎంత అవసరమో శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు, క్రీడల్లో ఉన్నతంగా రాణించేందుకు క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కానీ మంచి భవిష్యత్తు లక్ష్యంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీచైతన్య ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవీ.సురేష్, రీజనల్ ఇన్‌చార్జ్ వి.శ్రీనివాసరావు, రామినాయుడు, కోఆర్డినేటర్‌లు బాలరాజు, వెంకటరమణ, అప్పారావు, మనోరమ, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.