ఏనుగులతో జాగ్రత్త

ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అధిక శబ్ధంచేసే బాంబులను పేల్చరాదు

జిల్లా అటవీశాఖ అధికారి ప్రసూన

పార్వతీపురం టౌన్‌: ఒడిశా–ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో వారం రోజులుగా ఒంటరి ఏనుగు హరి సంచరిస్తోందని జిల్లా అటవీశాఖాధికారి ప్రసూన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏడు ఏనుగుల గుంపు ప్రస్తుతం తులసిరామినాయుడువలస వద్ద ఉందని, పరిసర గ్రామాలైన దలైవలస, ఉద్దవోలు, బురదవెంకటాపురం, గొల్లవానివలస, గొట్టివలస, సీమలవానివలస, ఉల్లిభద్ర, మరిపెంట, సంబానవలస, ఎర్రన్నగుడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీపావళి రోజున ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో అధిక శబ్ధాలుచేసే బాణసంచా కాల్చరాదని సూచించారు. ఒంటరి ఏనుగు హరి సంచారానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే సెల్‌: 87904 18918, 94933 99467 నంబర్లకు తెలియజేయాలన్నారు.
 

Read also in:
Back to Top