బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ● పల్నాడు జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేలకు అసమ్మతి సెగ తప్పడం లేదు. అసెంబ్లీలో విప్‌గా ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులే అసమ్మతి బావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రహస్య సమావేశాలు నిర్వహించారు. ఆయన నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి నాయకులతో జీవీ చర్చలు జరపాలని చూసినా వారు అంగీకరించలేదు. దీని వెనుక కొత్తగా పార్టీలోకి వచ్చిన ముఖ్య నాయకుల హస్తం ఉందనే భావనలో టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ● మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మానందరెడ్డికి అసమ్మతి తప్పడం లేదు. కారంపూడి, దుర్గి వంటి మండలాల్లో అధికార పార్టీ సామాజిక వర్గం నేతలు ఎంపీతో టచ్‌లోకి వెళ్లి ఎమ్మెల్యేపై అసంతృప్తి గళం వినిపిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పౌడా చైర్మన్‌గా ఉన్న మధుబాబు సైతం ఎమ్మెల్యేపై తిరుగుబాటు ధోరణిలో వ్యవహరిస్తుండటంతో నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ● గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. మామూలుగానే వర్గాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య ఈ ఎన్నికలు మరింత దూరం పెంచాయి. జంగా కృష్ణమూర్తికి ఎంపీ అండదండలు ఉండటంతో యరపతినేని వర్గం ఆయనపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా చినబాబు వర్గంగా కొనసాగుతున్న కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ బ్రహ్మయ్య చౌదరి సైతం యరపతినేనిపై అసమ్మతితో ఉన్నట్లు చెబుతున్నారు. ● నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్‌ ఎంపీ వర్గాల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యే పెత్తనాన్ని అంగీకరించకుండా ఎంపీ నేతృత్వంలో రాజకీయాలు చేస్తుండటంతో గ్రూపులుగా తమ్ముళ్లు తన్నుకుంటున్నారు. ● చిలకలూరిపేట నియోజకవర్గంలో సీనియర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకు అసమ్మతి సెగ తప్పడం లేదు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో ఇటీవల జరిగిన స్కూల్‌ మేనేజ్‌మెంట కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే, బాలకృష్ణ పీఏ వర్గీయులు బాహాబాహీకి దిగి రక్తం వచ్చేలా కొట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా చిలకలూరిపేటలో పేకాట క్లబ్‌ సైతం బాలకృష్ణ పీఏ, చినబాబు పీఏల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో పుల్లారావు ఉండటం గమనార్హం. ఆయనకు తెలియకుండానే మిర్చి యార్డు చైర్మన్‌ పదవి కుర్రా అప్పారావుకు దక్కడం, ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ సైతం నియోజకవర్గంలో తిరుగుతుండటంపై పుల్లారావు వర్గీయులు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు.

న్యూస్‌రీల్‌

సీనియర్‌లను పట్టించుకోని చినబాబు వర్గం మంత్రులు, ఎంపీల అండతో ఎమ్మెల్యేలపై నాయకుల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆందోళనలో శ్రేణులు

టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే గ్రూపులుగా తమ్ముళ్లు గొడవలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరికీ పదవులు దక్కడం లేదని, పైరవీలు చేసే వారికే ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేలకు తెలియకుండానే జిల్లాలో పదవుల పందేరం సాగుతోంది. దీంతో వారు లోలోపల రగిలిపోతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కొందరు సీనియర్‌లను చినబాబు వర్గంగా ఉన్న జూనియర్‌ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి పదవుల వరకు సీనియర్‌ ఎమ్మెల్యేల మాటకు విలువ లేకుండా పోతోంది. సొంత నియోజకవర్గాల్లోనే వారికి తెలియకుండా పదవులు ఇవ్వడంపై భగ్గుమంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవులు సైతం సీనియర్‌ల అభిప్రాయాలు తీసుకోకుండా భర్తీ చేశారని ఆగ్రహిస్తున్నారు. మండల స్థాయి నేతలను తమపై పెత్తనం చేసేందుకు పెడుతున్నారనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ల మాటను అధిష్ఠానం పెడనచెవిన పెడుతోందనే భావన వారిలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీలోకి కొత్తగా వచ్చిన జూనియర్లు, చినబాబు వర్గంగా కొనసాగుతున్న ద్వితీయ శ్రేణి నేతల మాటలే చెల్లుబాటు అవుతుండటంపై సీనియర్‌ ఎమ్మెల్యేలు లోలోపల రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బయటపడకుండా నాలుగు డబ్బులు సంపాదించుకుని ప్రశాంతంగా ఉందామనే భావనతో నియోజకవర్గాల్లో సైతం పెద్దగా కనిపించకుండా తిరుగుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, గుంటూరు ఎంపీల పెత్తనం నియోజకవర్గాల్లో ఎక్కువ అవడం వల్ల సీనియర్‌లకు ఇది మింగుడు పడడం లేదు. ఇటీవల ఇచ్చిన పదవుల్లోనూ ఎమ్మెల్యేలకంటే ఎంపీల అనుచరులకే ఎక్కువ పదవులు దక్కడంపై సైతం ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నేతల మధ్య అసమ్మతి భగ్గుమనడం ఆ పార్టీ కార్యకర్తలకు నిద్ర పట్టనీయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక పోరులో ఓటమి తప్పదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.

పల్నాడు జిల్లాలో....

పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల బాహాబాహీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement