143 ఓటరు దరఖాస్తులపై సూపర్‌ చెకింగ్‌ | - | Sakshi
Sakshi News home page

143 ఓటరు దరఖాస్తులపై సూపర్‌ చెకింగ్‌

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

సత్తెనపల్లి: జిల్లాలో తన లాగిన్‌కు వచ్చిన 143 ఓటరు దరఖాస్తులపై జిల్లా రోల్‌ అబ్జర్వర్‌ రేవు ముత్యాల రాజు మంగళవారం సూపర్‌ చెకింగ్‌ నిర్వహించారు. జిల్లాలో రెండవ విజిట్‌లో భాగంగా ఏడు నియోజకవర్గాల నుంచి ఫారం–6, 7, 8ల్లో తిరస్కరించినవి, ఆమోదించినవి ర్యాండమ్‌గా ఆయన లాగిన్‌కు వచ్చిన వాటిపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో జిల్లాలోని 143 మంది బీఎల్‌ఓలు, ఏడుగురు ఏఈఆర్‌ఓలు, ఏడుగురు ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులతో(ఈఆర్‌ఓ) సమీక్ష నిర్వహించారు. చెక్‌ చేసుకొని రిమార్కులు రాసుకున్నారు. ఈ నివేదికను ఎన్నికల కమిషన్‌కు ఆయన అందించనున్నారు. సమావేశంలో ఈఆర్‌ఓలు కె.అద్దయ్య (మాచర్ల), కె.గోపాలకృష్ణ (సత్తెనపల్లి), మురళీకృష్ణ (గురజాల), కె.శ్రీరాములు (పెదకూరపాడు), బాలకృష్ణ (నరసరావుపేట), బి.నారదముని (వినుకొండ),బాలలీలారాణి(చిలకలూరిపేట), ఏఈఆరోలు, బీఎల్‌ఓలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement