ఆర్‌టీసీ భవిష్యత్‌కు రాజీ లేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీ భవిష్యత్‌కు రాజీ లేని పోరాటం

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి

నరసరావుపేట: ఆర్‌టీసీ భవిష్యత్‌, ఉద్యోగుల భద్రత, ప్రయాణికుల అవసరాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్‌టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్‌ సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు. ఏపీ పీటీడీ (ఆర్‌టీసీ) ఈయూ పల్నాడు జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్‌ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్‌ ఖాజా అధ్యక్షతన, జిల్లా కార్యదర్శి జి. తిరుపతిరావు ఆధ్వర్యంలో బుధవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా దామోదరరావు మాట్లాడుతూ ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఆర్‌టీసీ ఆస్తులు, డిపోలు, రూట్లు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. విద్యుత్‌ బస్సుల ప్రవేశంతో మూసివేసిన డిపోలను ఆరు నెలల్లో పునఃప్రారంభించాలని కోరారు. పల్నాడు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ ఎస్‌. నాగమల్లేశ్వరరావు, స్టేట్‌ ఉపాధ్యక్షుడు మందపాటి శంకరరావు, నెల్లూరు జోన్‌ జోనల్‌ అధ్యక్షుడు బెజవాడ రవి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బి. కోటేశ్వరరావు, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌. కోటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, ఆర్టీసీ జిల్లా కార్యదర్శి జి. తిరుపతిరావు, నెల్లూరు జోన్‌ కమిటీ నాయకులు దిల్షాద్‌ బేగం, కమల, జిల్లా చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఒ. సుశీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement