నాకు వెన్నెముక అరిగిపోయింది. కుమారుడికి 26 ఏళ్ల వయస్సు ఉన్నా మంచానికే పరిమితమయ్యాడు. మెదడులో నరాలు చచ్చుబడినట్లు 95 శాతం మెడికల్ బోర్డు సర్టిఫికెట్, మెంటల్ డిజార్డర్ వంద శాతం సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే కేవలం దివ్యాంగ పింఛన్ మాత్రమే వస్తోంది. నాలుగు నెలల క్రితం మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కావాలంటే తెచ్చాను. ప్రస్తుతం కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసేందుకు వెళ్లితే వెబ్‌సైట్ కూడా తెరుచుకోలేదు. అదేమంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతున్నారు. ఇప్పటికై నా వైద్య ఆరోగ్యశాఖ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
– కుంచనపల్లి శ్రీనివాసరావు,
22వ వార్డు, సత్తెనపల్లి


