రాజుపాలెం: అప్పుల బాధతో డ్వాక్రా మహిళ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందిన ఘటన మండలంలోని కొండమోడులో చోటుచేసుకుంది. గ్రామంలో ఆశియా డ్వాక్రా గ్రూపులో పది మంది సభ్యులున్నారు. సయ్యద్ ఖాశీంబి అలియాస్ గౌసియా(35) ఆశియా గ్రూపులో రెండవ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. గౌసియా గ్రూపు సభ్యులకు తెలియకుండా గ్రూపునకు సంబంధించిన డబ్బులను తన సొంత ఖర్చులకు వాడుకోవడం వలన ఆశియా డ్వాక్రా గ్రూప్‌కు రూ.3 లక్షలు అప్పు పడడంతో సభ్యులందరూ ఇంటికి వెళ్లి పదేపదే అడగడంతో మనస్తాపానికి గురై తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భర్త చాంద్‌బాషా, కుటుంబ సభ్యులు గౌసియాను పిడుగురాళ్ల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమస్టర్ నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి ఇంటర్ చదివే కుమారుడు, పదవ తరగతి చదివే కుమార్తె ఉన్నారు.


