జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు
నూజండ్ల: నీటి వసతి కలిగిన ప్రతి రైతు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు సూచించారు. మండల పరిధిలోని పువ్వాడలో విజయ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు ఆయిల్ ఫామ్ సాగు, రాయితీల గురించి రైతులకు వివరించారు. నూరు శాతం రాయితీతో ఒక హెక్టారుకు గాను 125 మొక్కలు ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగా హెక్టార్‌కు నాలుగు సంవత్సరాలకు గాను సాగు ప్రోత్సాహకం కింద రూ.21 వేలు అందిస్తారని తెలిపారు. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు నిబంధనల మేరకు డ్రిప్ సిస్టమ్ ఇస్తామన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శాఖాధికారులు షేక్ నబీ రసూల్, మేకల నరసింహారెడ్డి పాల్గొన్నారు.


