రొంపిచర్ల: మండలంలోని విప్పర్లరెడ్డిపాలెం పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రవినాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన నినాదాలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించారు. ఓజోన్ పొరను సూచిస్తూ త్రికారంలో కూర్చొని పర్యావరణ పరిరక్షణపై సందేశం అందించారు. ఓజోన్ పరిరక్షణపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేసి, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, కాలుష్య నియంత్రణ, మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టాలని సంకల్పించారు. ప్రతి విద్యార్థి ‘ఓజోన్ రక్షకుడు’గా మారి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు.


