నరసరావుపేట రూరల్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం బుధవారం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, కంటి, దంత వైద్య పరీక్షలు చేశారు. మహాత్మాగాంధీ హాస్పిటల్, డాక్టర్ రామలింగారెడ్డి మాక్సివిజన్ కంటి ఆస్పత్రి, వసంత్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది శిబిరంలో పాల్గొని పోలీసు సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలను వైద్యులు అందించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసామని, వైద్య సమస్యలు ఉన్నట్టయితే ముందుగా తెలుసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉటుందని ఏఆర్ డిఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్‌ఐ ఎస్.కృష్ణ, వెల్ఫేర్ ఆర్‌ఐ ఎల్.గోపినాథ్ పాల్గొన్నారు.


