అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతి వద్దగల కృష్ణానదిలో వినాయక విగ్రహ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. గురువారం గణపతి నవరాత్రుల్లో రెండవరోజు మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా గణేష్ విగ్రహాలు తరలి రావటం ప్రారంభమైంది. నది ఒడ్డున ధ్యానబుద్ధ ఘాట్‌లో పోలీస్ అధికారులు నిమజ్జ నోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ అచ్చియ్య తమ సిబ్బందితో గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. మైకుల ద్వారా నిమజ్జనానికి వచ్చిన భక్తులను హెచ్చరిస్తూ ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. కృష్ణానది మధ్యలోకి పడవల సహాయంతో వినాయక విగ్రహాలను తీసుకువెళ్ళి నిమజ్జనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.


