డీ మార్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డీ మార్టు సంస్థపై చర్యలు తీసుకోవాలి

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

నరసరావుపేట: మోసపూరిత మాటలే పెట్టుబడిగా బ్యాంకులను మోసం చేస్తున్న కార్పొరేట్‌ శక్తులు, డీ–మార్ట్‌, రిలయన్స్‌ ఫ్రెష్‌ వంటి షాపింగ్‌ మాల్స్‌ స్థాపించి అందులో పనిచేసే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ ఆరోపించారు. దళిత యువతి స్వర్ణలత సర్టిఫికెట్లతోపాటు ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఫెస్టిసైడ్‌ లైసెన్స్‌ పొందిన నరసరావుపేట డీ–మార్టు యాజమాన్యం మోసాలను బట్టబయలు చేస్తూ కేఎన్‌పీఎస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ దళిత యువతి స్వర్ణలతను మోసం చేసి ఆమె సంతకాలను ఫోర్జరీ చేసి ఫెస్టిసైడ్‌ లైసెనన్స్‌ పొందిన నక్కరాజుతోపాటు కాసులకు కక్కుర్తి పడి దొంగ లైసెనన్స్‌ ఇచ్చిన అగ్రికల్చర్‌ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు అమలుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. స్వర్ణలత పేరుతో నక్కరాజు తీసుకున్న లైసెన్స్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. డీమార్టు యాజమాన్యంతో కుమ్మకై ్క బాధితులను భయపెడుతున్న సీఐ ఫిరోజ్‌, కానిస్టేబుల్‌ పాండురంగారావులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.ఽ ధర్నా అనంతరం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఓర్సు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్న ప్రసాద్‌, జిల్లా కమిటీ సభ్యులు కొయ్యలమూడి జయమ్మ, రొంపిచర్ల మండల కమిటీ సభ్యులు బి రామయ్య, బాధితులు స్వర్ణలత, రామచంద్రరావు, అనిల్‌, వినుకొండ కోటి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement