నిర్వహణకు నిధులు విదల్చని ప్రభుత్వం చేతిచమురు వదిలించుకుంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మొక్కుబడిగా శిబిరాలు ఒక్క పూటకే పరిమితం పర్యవేక్షణ కొరవడటంతో నెరవేరని ఆశయం జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు
ఏ ఏ అంశాలపై అవగాహన కల్పించాలంటే...
బాల, బాలికలను బృందాలుగా విభజించి అందులో సభ్యులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకోవడం.
స్వీయ అవగాహన ద్వారా తనను తాను తెలుసుకోవడం, ఆత్మవిశ్వాసం పెంచేలా చేయడం.
ఆరోగ్య మేళా, రక్తహీనత, కిశోరీ బాలికల ఆరోగ్య సమస్యల నివారణ పై అవగాహన కల్పించడం.
సమాజంలో పిల్లలు ఎదుర్కొనే వ్యక్తిగత, సమూహ అవసరాలు, సవాళ్లను అధిగ మించడం, ధైర్యసాహసాలు పెంపొందించడం.
దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన, తీసుకోవలసిన జాగ్రత్తలు.
ఫోక్సో చట్టం, పీసీఎంఏ చట్టం, డీవీ, ఆర్‌టీఈ చట్టాలపై అవగాహన.
పొదుపు అలవాట్లు, క్రీడలు, యోగ ప్రాముఖ్యం.
సైబర్ భద్రత, ఆన్‌లైన్ భద్రతపై అవగాహన, మత్తుపదార్థాల వల్ల కలిగే అనర్ధాలు వివరించడం.
బాల్యవివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్యప్రోత్సాహం తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంది.
సత్తెనపల్లి: కిశోరి బాలికల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిశోరి వికాసం కార్యక్రమం తూతూమంత్రంగా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్య దశలోనే లైంగిక వేధింపులు, పదో తరగతి పూర్తి కాకముందే మూడు ముళ్లు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు అనేక రకాల వేధింపులు వంటి చర్యలతో ఏం చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు కిశోరి వికాసం వేసవి శిబిరాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కార్యక్రమం నిర్వహణ ఖర్చులకు ప్రభుత్వం పైసా నిధులు విదల్చని పరిస్థితి ఉంది. నిధుల కొరతతో కౌమార దశలో ఉన్న బాల,బాలికల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిశోరి వికాసం కార్యక్రమం గాడి తప్పుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలు వారి సొంత డబ్బులు వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా .. ఫొటోలకు ఫోజులిస్తూ ప్రచార ఆర్బాటం చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు పెద్దగా జరగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు...
జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఈ నెల 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు 11 నుంచి 14 సంవత్సరాలలోపు బాలికలు, 15 నుంచి 18 సంవత్సరాలలోపు బాలురను గ్రూపులుగా విభజించి ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం శిబిరాలు నిర్వహించాల్సి ఉంది. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం ఈ శిబిరాలు నిర్వహించాలి. ఇందులో విద్య, ఆరోగ్యం సచివాలయం, మెప్మా, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ, ఆర్పీలు భాగస్వామ్యం కావాల్సి ఉంది. అయితే ఐసీడీఎస్ అధికారులు బాల,బాలికలకు కలిపి ఉదయం పూట ఈ కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఎగ్గొట్టేస్తున్నారని తెలు స్తుంది. ఈ కార్యక్రమంలో కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది కూడా గైర్హాజరవుతున్నా రన్న విమర్శలు లేకపోలేదు.


