● జీవిత చక్రం.. జాగ్రత్తన్నా! | - | Sakshi
Sakshi News home page

● జీవిత చక్రం.. జాగ్రత్తన్నా!

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

డ్రైవింగ్‌ అంటే ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. ఎంతో మంది జీవితాలు వారి చేతిలోనే ఉన్నాయి. అలాంటి బస్సు డ్రైవర్‌ సెల్‌ ఫోన్‌లో ఏదో చూస్తూ వాహనాన్ని నడిపేస్తున్నాడు. మాచర్ల నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్‌టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఎక్కారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా సెల్‌ చూసుకుంటూ డ్రైవింగ్‌ చేస్తున్నారు. గుంటూరు నుంచి కొండమోడు వరకు బైపాస్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒక లైన్‌ మాత్రమే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలోనూ డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

– పిడుగురాళ్ల

Advertisement
 
Advertisement
Advertisement