కారెంపూడి: స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ సెక్షన్ ఆఫీస్ వద్ద మండలంలోని పేటసన్నెగండ్ల శివారు సింగరుట్ల తండా రైతులు శుక్రవారం రాత్రి ఽఆందోళనకు దిగారు. తమ తండాకు నాలుగు రోజులుగా కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందికి అధికారులకు ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదన్నారు. తండాకు వచ్చే జంపర్లు ఎత్తేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని రోజుకు అనేక సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కరెంటు లోవోల్టేజీ హైలోవోల్టేజి వల్ల 10 మోటార్లు దాకా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జొన్న రైతుల సమస్యలపై
స్పందించండి
జిల్లా కలెక్టర్‌కు అంబటి వినతిపత్రం
గుంటూరు వెస్ట్: పొన్నూరు నియోజకవర్గంతోపాటు, జిల్లాలో జొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మకు శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా, పొన్నూరు శాసనసభ్యుడితోపాటు, మరికొందరు దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, నేతలు పాల్గొన్నారు.


