అమెరికాలో పల్నాడు జిల్లా ఫాదర్‌ వేళంగిణిరెడ్డి మృతి | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో పల్నాడు జిల్లా ఫాదర్‌ వేళంగిణిరెడ్డి మృతి

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువుకు చెందిన విచారణకర్త రెవ.ఫాదర్‌ తుమ్మా వేళంగిణిరెడ్డి (45) సువార్త ప్రచారం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. వీరి స్వగ్రామం తాళ్లచెరువు కాగా ఇదే గ్రామంలోని బాలయేసు చర్చిలో విచారణకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో విచారణకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి యేటా మే నెలలో సువార్త ప్రచారం కోసం అమెరికా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్‌లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేశారు. ఆయన సోదరుడు సాగర్‌థామస్‌రెడ్డి సినిమా డైరెక్టర్‌కా గా, తల్లి నిర్మలామేరి విశ్వాసురాలు. తండ్రి పీటర్‌రెడ్డి దైవసేవకులుగా పనిచేస్తూ క్యాన్సర్‌ వ్యాధితో మృతిచెందారు. ఆయన విచారణ గురువులుగా ఫిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, యనమదల, పెద్దపలకలూరు తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాళ్లచెరువు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement