సముద్రతీరంలో మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

సముద్రతీరంలో మృతదేహం లభ్యం

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

సముద్రతీరంలో మృతదేహం లభ్యం

చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్‌ ఎస్‌ఐ ఎ.చంద్రశేఖర్‌ తెలిపారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్‌ ఎస్‌ఐ 9121102144, చీరాల రూరల్‌ సర్కిల్‌ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement