వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులకు రాష్ట్ర పదవులు నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పలు రాష్ట్ర విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా కోట్ల నాగిరెడ్డి (మాచర్ల), స్టేట్ ఐటీ వింగ్ కార్యదర్శిగా వెన్నా ప్రకాష్‌రెడ్డి (గురజాల), పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కోడూరి వెంకటేశ్వరరెడ్డి (నరసరావుపేట) నియమితులయ్యారు. రేపటి నుంచి సాతులూరులో జాతీయస్థాయి నాటికల పోటీలు నాదెండ్ల: పల్నాడు జిల్లా సాతులూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నాలుగవ జాతీయస్థాయి నాటిక పోటీలు ఈనెల 24 నుంచి 28 వరకూ నిర్వహించనున్నారు. స్థానిక పశువుల ఆసుపత్రి సమీపంలోని భారతీ కళావేదిక వద్ద జరిగే నాటిక పోటీలు ఈ నెల 24న సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమౌతాయని కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. తొలిరోజు ఆదివారం విశ్వామిత్ర ఏకపాత్ర వజ్జా మధుసూదనరావు, యడ్లపాడు మానవతాసాగరి, జరుగుల రామారావు దర్శకత్వంలో అందరూ మంచివారే కానీ.. గుంటూరు ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో సరిగమ పాప ప్రదర్శనలు జరగనున్నాయి. పరిషత్ పర్యవేక్షకులుగా జరుగుల రామారావు, చెరుకూరి సాంబశివరావువ్యవహరించనున్నారు. వ్యాపారి అదృశ్యం
ఆందోళనలో బాఽధితులు
మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లోను ఫిర్యాదు చేశారు.