కారు, ద్విచక్రవాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు, ద్విచక్రవాహనం ఢీ

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

నలుగురికి గాయాలు

మాచర్ల రూరల్‌: కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీశైలం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయటానికి ప్రయత్నించే సమయంలో గొట్టిపాళ్ల నుంచి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు పులిమెల కోటయ్య తలకు తీవ్ర గాయాలై, ఎడమ కాలు విరిగింది. మరొక వ్యక్తి పులిమెల అశోక్‌కు కారు గ్లాసు ముఖం పై గుచ్చుకుంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement