పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026 పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు వడగాలులు, ఉక్కపోతకు అల్లాడిపోతున్న ప్రజలు

న్యూస్‌రీల్‌

పులిచింతల సమాచారం

శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026

@48.1

పిడుగురాళ్ల: పిడుగురాళ్లలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం ఏకంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో స్థానికంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. బుధవారం 47.6 డిగ్రీలు నమోదయి పెరుగుతూ పోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్రాంతంమంతా అగ్నిగుండంగా మారింది. అత్యవసరమైతేనే ప్రజలు తమ ఇళ్లల్లో నుంచి బయటికి వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉష్ణోగ్రత భారీస్థాయిలో నమోదవుతోంది.

వడదెబ్బకు వృద్ధురాలు మృతి

మాచర్ల రూరల్‌: తీవ్రమైన వడగాల్పులకు, ఎండ దెబ్బకు తాళలేక వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మాచర్ల మండలం రాయవరం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని 23వ వార్డు, యాదవ బజారులో నివసిస్తున్న శాఖమూరి హేమలత (65) పూజలు చేసేందుకు తరుచూ పలు దేవాలయాలను సందర్శిస్తుంటుంది. ఈ నేపథ్యంలో గురువారం రాయవరం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి అనంతరం స్పృహ తప్పి పడిపోయింది. గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై రూరల్‌ పోలీసులను వివరణ అడగ్గా కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు.

Advertisement
 
Advertisement
Advertisement