పరీక్షలు సమన్వయంతో నిర్వహించండి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలు సమన్వయంతో నిర్వహించండి

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

పరీక్షలు సమన్వయంతో నిర్వహించండి లక్ష్మీచెన్నకేశవునికి సువర్ణ చక్రం వితరణ అండర్‌–13 చదరంగం జిల్లా జట్టు ఎంపిక

నరసరావుపేట: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించే పదవ తరగతి రెగ్యులర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఎపాస్‌ (ఏపీఓఎస్‌ఎస్‌) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్నీ శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ నారదముని కోరారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గురువారం ఆయా విభాగాల అధికారులతో కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్‌ నాలుగు వరకు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలోని 399 పాఠశాలల నుంచి 3112 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. నరసరావుపేట డివిజన్‌లో 13, సత్తెనపల్లి డివిజన్‌లో 11తో మొత్తం 24 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిని సమన్వయపర్చేందుకు 24 మంది చీఫ్‌ సూపరిండెంట్లు, 24మంది డిపార్టుమెంట్‌ అధికారులు, పరీక్షల పర్యవేక్షణకు మూడు ప్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అపాస్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 25 నుంచి జూన్‌ ఒకటి వరకు నిర్వహిస్తారని చెప్పారు. ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జూన్‌ రెండు నుంచి ఆరు వరకు జరుగుతాయన్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 765మంది, ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు 1828తో కలిపి మొత్తం 2593మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ పరీక్షలు జరిగేందుకు 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమలుచేయాలని, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక ప్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటుచేసి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశంలేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాచర్ల రూరల్‌ : మాచర్లలోని లక్ష్మీచెన్నకేశవస్వామికి విద్యాసంస్థల అధినేత జున్నా శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు రూ.4లక్షల విలువైన సువర్ణ విష్ణు చక్రం గురువారం అందజేశారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ కొమెర అనంతరాములు, ఈఓ సైదయ్యలకు అందించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దాతలు సమర్పించిన సువర్ణ చక్రం లక్ష్మీచెన్నకేశవస్వామి ఎడమ చేతికి అలంకరించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి భవిష్యత్తులో మరింత సహాయ సహకారమందిస్తామన్నారు. కార్యక్రమంలో జున్నా పద్మావతి, చక్రధర్‌రెడ్డి, వెంకట దీప్తి, అభిరామ్‌రెడ్డి, అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రథసారధి సుంకె వాసు పాల్గొన్నారు.

మాచర్ల రూరల్‌: పల్నాడు జిల్లా చెస్‌ అకాడమి నేతృత్వంలో గురువారం పల్నాడు జిల్లా అండర్‌–13 బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేశారు. స్థానిక బీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ పోటీలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. ఎంపికై న వీరు ఈనెల 23 నుంచి మార్కాపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు కోచ్‌ కిరణ్‌ తెలిపారు. మొదటి స్థానం అమర్‌నాఽథ్‌ యాదవ్‌, ద్వితీయ స్థానం సాత్విక్‌, బాలికల్లో మొదటి స్థానం మేఘశ్రీ కోమలి, ద్వితీయ స్థానం సుస్మితలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులకు ప్రతిభ జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ షేక్‌ నాగూర్‌వలి, రంగమ్మ చిన్న పిల్లల హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ దశరఽథ్‌లు అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement