నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 32 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్‌కు 2,156 మంది హాజరు కాగా మరో 168 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఏడు కేంద్రాల్లో నిర్వహించిన ఒకేషనల్ పరీక్షకు 211 మంది హాజరయ్యారు. కాగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 31 కేంద్రాలలో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,026 మంది హాజరు కాగా మరో 106 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విద్యార్థులు 143 మందికి గాను 125 మంది హాజరయ్యారు. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులకు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సూచించారు. తాగునీరు, ఫ్యాన్లు, వైద్య సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


