ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్టు

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

నిందితుల వద్ద నుంచి రూ.6లక్షలు నగదు, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం

నరసరావుపేట రూరల్‌: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్‌ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్‌, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్‌పోలీసుస్టేషన్‌ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్‌టీ నగర్‌లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్‌ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్‌లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్‌లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్‌ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు. రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement