న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026
ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర ధరలు సామాన్యుల జేబులు ఖాళీ చేయగా.. దొరకడమే గగనమై గ్యాస్ బండ నెత్తిన పిడుగులా మారగా.. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో కుదేలై కుటుంబ పోషణ కష్టంగా మారి, ఏం తినేటట్లు లేము.. ఏం కొనేటట్లు లేమంటూ.. చస్తూ, బతుకుతూ, బతుకీడుస్తున్న సామాన్యుడిపై తాజాగా కూటమి ప్రభుత్వం ‘పెట్రో’ ధరల బాంబు వేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ సామాన్యుడి పక్షాన నిలిచి తన గళం వినిపించింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దెబ్బకు పెరిగిన నిత్యవస రాలతో సామాన్యుడి బతుకు దుర్భరం అయిందని, పెరిగిన ‘పెట్రో’ ధరలతో మరింత కుదేలయ్యారన్నారు. వెంటనే పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.4,500 వరకు పలికింది.
మాచర్లలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు
7


