అర్జీలు సత్వరం పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించండి

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

నరసరావుపేట: అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజనా సింహ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 162 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిరోజు మానిటర్‌ చేయాలని, గడువు తీరకముందే అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చేయాలని ఆదేశించారు. డీఆర్‌ఓ నారదముని, డీపీఓ గోపీనాయక్‌, డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు.

రీ సర్వేలో తప్పులు జరగకూడదు

నరసరావుపేట: గ్రామాల్లో జరిగే రీ సర్వేలో ఎటువంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజన సింహ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి రీ సర్వే, రెవెన్యూ అంశాలపై టెలి కాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలోని భూ సమస్యలు పరిష్కరించడంలో మండల సర్వేయర్లు, వీఆర్‌ఓలకు ప్రముఖ పాత్ర ఉందన్నారు. యాప్‌ ద్వారా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలని గ్రామ సర్వేయర్లకు ఆదేశించారు. గ్రామాలలో రాజకీయాలు పక్కన పెట్టి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదే విధంగా మంగళవారం గురజాల డివిజన్‌, బుధవారం సత్తెనపల్లి డివిజన్‌, గురువారం నరసరావుపేట డివిజన్‌ పరిధిలో వర్క్‌ షాప్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజన సింహ

Advertisement
 
Advertisement
Advertisement