కాపురం సరిదిద్దేందుకు వచ్చిన వారిపై దాడి | - | Sakshi
Sakshi News home page

కాపురం సరిదిద్దేందుకు వచ్చిన వారిపై దాడి

May 19 2026 1:40 AM | Updated on May 19 2026 1:40 AM

నాగవరం(క్రోసూరు): కాపురం సరిదిద్దేందుకు వచ్చి భార్య తరపు వారిపై భర్త కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దాడి చేశారు. దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. దీంతో నాగవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవిబాబు తెలిపిన వివరాలు.. మండలంలోని నాగవరం గ్రామానికి చెందిన మస్తాన్‌వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అత్తమామలకు చెందిన ఎకరన్న పొలం రాయించుకు రావాలని భార్యను ఇటీవల పుట్టింటికి పంపాడు. కుమార్తె కాపురాన్ని సరిదిద్దేందుకు కరిష్మా తల్లి అల్లాబీ, అమ్మమ్మ ఫాతిమా(75)లు ఆదివారం నాగవరం చేరుకున్నారు. అక్కడ మాటామాట పెరిగింది. దీంతో మస్తాన్‌వలి తండ్రి వలి, తల్లి సైదాబీ, సోదరులు ఇమాంసా, ఇబ్రహీంలు వారిపై దాడి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆటోలో సత్తెనపల్లి బయలు దేరుతుండగా మార్గంమధ్యలో ఫాతిమా మృతి చెందింది. తీవ్రగాయాలైన అల్లాబీ, కరిష్మాలు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వృద్ధురాలు మృతి

నాగవరంలో ఉద్రిక్తత

Advertisement
 
Advertisement
Advertisement